నిరుద్యోగ యువతకు 4లక్షలు..

నిరుద్యోగ యువతకు 4లక్షలు..

రాజీవ్ యువ వికాసం స్కీమ్ ప్రారంభం: కలికోట బాలరాజు.

అర్హులైన నిరుద్యోగుల కోసం దరఖాస్తు.

ప్రశ్న ఆయుధం మార్చి 24: కూకట్‌పల్లి ప్రతినిధి

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతను మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా వారిని వారి సొంత కాళ్లపై నిలుచునేలా చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త పథకాన్ని ముందుకు తీసుకొని వచ్చింది. దీనిలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం పథకానికి అర్హులైన నిరుద్యోగ యువతీ యువకులు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకుడు కలికోట బాలరాజు కోరారు. ఈ మేరకు శనివారం పత్రిక ప్రకటనను విడుదల చేశారు. రాజీవ్ యువ వికాస్ పథకానికి సంబంధించి ఎస్సి, ఎస్టీ,బీసీ,మైనారిటీ వర్గాలకు చెందిన యువతకు నాలుగు రక్షల రూపాయల మేర ఆర్థిక సాయంని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేశారు.

*ఆన్ లైన్ లో ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ.*

యువతకు ఆర్థికంగా భరోసా కల్పించేందుకు ప్రారంభించిన రాజీవ్ యువ వికాస్ పథకానికి సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుందని అన్నారు. అర్హులైన వారు ఈనెల 17వ తేదీ నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

*జూన్ 2వ తేదీన లబ్ధిదారుల ఎంపిక*

పథకానికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 5వ తేదీన ముగిసిన అనంతరం వాటిని పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు అధికారులు దీనిలో భాగంగా నిరుద్యోగ యువతకు 60 నుంచి 80 శాతం వరకు ప్రభుత్వం ద్వారా సబ్సిడీని ఇచ్చేలా ఈ పథకాన్ని రూపొందించారు. రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి ఎంపికైన లబ్ధిదారులకు జూన్ రెండవ తేదీన రాయితీ రుణాలను మంజూరు చేయడమే కాకుండా ఆదర్శంగా నిలిచేలా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం వినకుండా మార్గదర్శకంగా పనిచేస్తుందని వారు తెలిపారు.

Join WhatsApp

Join Now