మున్సిపల్ కార్మికుడి కూతురు పెళ్లికి 40 వేల కానుక
— టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి చేయూత
కామారెడ్డి, జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం నవంబర్ 18
కామారెడ్డి మున్సిపల్‌లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుడు షేక్ మహబూబ్ కుమార్తె పెళ్లి సందర్భంగా కుటుంబ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని టిపిసిసి స్టేట్ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి రూ.40,000 పెళ్లి కానుకగా అందజేశారు. సామాజిక బాధ్యతతో ముందుకొచ్చిన ఆయన ఈ సహాయం పట్ల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు పంపరి శ్రీనివాస్, జూలూరి సుధాకర్, చాట్ల వంశీ, సాయి బాబా, మున్సిపల్ యూనియన్ నాయకులు ప్రభాకర్, ఆనంద్, ప్రభు, జ్యోతి, దీవెన తదితరులు పాల్గొన్నారు.