కామారెడ్డి జిల్లాలో 49 మద్యం షాపులకు 419 దరఖాస్తులు!
స్టేషన్‌వారీగా అధికంగా కామారెడ్డిలోనే దరఖాస్తులు
కామారెడ్డి జిల్లా ప్రతినిధి (ప్రశ్న ఆయుధం) అక్టోబర్ 16
2025–2027 సంవత్సరాల మద్యం దుకాణాల లైసెన్స్‌లకు దరఖాస్తుల స్వీకరణలో కామారెడ్డి జిల్లాలో ఉత్సాహం కనిపిస్తోంది. ఈ రోజు వరకు మొత్తం 49 వైన్ షాప్‌లకు 419 దరఖాస్తులు అందాయి. జిల్లాలో కామారెడ్డి స్టేషన్ పరిధిలోని 15 షాపులకు 104 దరఖాస్తులు, దోమకొండలోని 8 షాపులకు 77 దరఖాస్తులు, ఎల్లారెడ్డి పరిధిలోని 7 షాపులకు 75 దరఖాస్తులు, బాన్సువాడలోని 9 షాపులకు 84 దరఖాస్తులు, బీచుకుంద పరిధిలోని 10 షాపులకు 79 దరఖాస్తులు వచ్చినట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ బి.హనుమంతరావు తెలిపారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం లాటరీ ద్వారా లైసెన్స్‌లు కేటాయించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.