Site icon PRASHNA AYUDHAM

బీసీలకు స్థానిక ఎన్నికల్లో 42% శాతం హర్షనీయం 

IMG 20250712 WA0019

బీసీలకు స్థానిక ఎన్నికల్లో 42% శాతం హర్షనీయం

కామారెడ్డి జిల్లా ఇన్చార్జ్               (ప్రశ్న ఆయుధం) జూలై 12

-కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం

సీఎం రేవంత్ రెడ్డి , ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ చిత్రపటానికి పాలాభిషేకం..

మాచారెడ్డి మండల కేంద్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ చిత్ర పటాలకు పాలాభిషేకం నిర్వహించారు. మాచారెడ్డి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర టపాకాయలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు.

సబ్బండవర్ణాల అభివృద్ధి కాంగ్రెస్ ద్వేయం మాచారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాలోత్ నౌశిలాల్ నాయక్ మాట్లాడుతూ.

సబ్బండ వర్ణాల అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని అన్ని వర్గాల అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం పని చేస్తుందని ఒక ప్రకటనలో తెలిపారు.తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రివర్గంతో పాటు, పార్టీ అధ్యక్షున్ని బీసీ వర్గానికి కేటాయించి కాంగ్రెస్ చిత్తశుద్ధిని నిరూపించుకుందని పేర్కొన్నారు. పేద బడుగు బలహీన వర్గాల సొంతింటి కలను నెరవేరుస్తూ పేదల గుండెల్లో నిలిచిపోయిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కొనియాడారు. గత ప్రభుత్వ హయాంలో మహిళలను కించపరుస్తూ మంత్రివర్గంలో ఒక పదవి కూడా ఇవ్వని నియంత ప్రభుత్వం కేసీఆర్ అని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే స్వేచ్ఛకు మారుపేరని అన్నారు. దొరల పాలనలో సబ్బండ వర్ణాలు అణిగిపోయాయని పేర్కొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ప్రక్రియను కామారెడ్డి లోని షబ్బీర్ అలీ ఇంట్లో ప్రక్రియను పూర్తి చేసి ఎన్నికల హామీలో భాగంగా అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని పేర్కొన్నారు. అమలును జీర్ణించుకోలేకనే ప్రతిపక్షాలు దయ్యాలు వేదాలను వల్లించినట్లు అసత్య ఆరోపణలు చేస్తున్నారని, ప్రజలు గత ఎన్నికల్లో బుద్ధి చెప్పిన బి.ఆర్.ఎస్ కు బుద్ధి రావడం లేదని ఎద్దేవా చేశారు. ఇకనైనా ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వానికి సూచనలు ఇస్తూ ప్రతిపక్ష హోదాను కాపాడుకోవాలని సూచించారు

ఈ కార్యక్రమంలో కామారెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్ నునావత్ గణేష్ నాయక్, యూత్ అధ్యక్షులు రాజిరెడ్డి, ఎస్టీ సెల్ అధ్యక్షులు శంకర్ నాయక్, గ్రామ కమిటీ అధ్యక్షులు భాస్కర్ గౌడ్, బన్సీ లాల్ నాయక్, రావుల ప్రభాకర్,

ఎన్ ఎస్ యు అధ్యక్షులు బద్రి, సదర్ నాయక్, సతీష్,

సంజీవ్ కుమార్,

తిరుపతి, రవి, రవీందర్, ప్రకాష్,బన్సీ,తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version