వెనుకబడిన తరగతులకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు

IMG 20250712 WA0607

వెనుకబడిన తరగతులకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు

హైదరాబాద్
ప్రశ్న ఆయుధం
జూలై 12

వెనుకబడిన తరగతులకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రభుత్వ సంకల్పానికి బీసీలంతా అండగా నిలవాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కోరారు. అందరం కలిసి ఒక రక్షణ కవచంలా బీసీ రిజర్వేషన్లను కాపాడుకోవలసిన అవసరం ఉందని చెప్పారు. మంత్రి కొండా సురేఖ , సలహాదారు వేం నరేందర్ రెడ్డి , ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ , విప్ ఆది శ్రీనివాస్ , పలువురు కార్పొరేషన్ చైర్మన్లు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ , బీసీ సంఘాల ప్రతినిధులు వేర్వేరుగా ముఖ్యమంత్రి ని కలిశారు. వెనుకబడిన తరగతులకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఆర్డినెన్స్ జారీ చేయాలని రాష్ట్ర మంత్రిమండలి తీర్మానించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి గారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడారు. “బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న సంకల్పంతోనే ఇంతకాలం స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశాం. నెల రోజుల్లోగా స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు చేయాలని హైకోర్టు ఉత్తర్వులు వెలువరించింది. రిజర్వేషన్లు 50 శాతానికి మించి పెంచరాదని గత ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టం చేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment