డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో ఒకే రోజులో 42 మందికి శిక్షలు

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో ఒకే రోజులో 42 మందికి శిక్షలు

 

జైలు, జరిమానాలతో పోలీసులు కఠిన హెచ్చరిక

 

తెలంగాణ స్టేట్ ఇంచార్జ్

(ప్రశ్న ఆయుధం) అక్టోబర్ 10

 

 

మద్యం సేవించి వాహనం నడపడం ప్రమాదాలకు ప్రధాన కారణమవుతోందని, రోడ్లపై నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసే వారి వల్ల అమాయక ప్రాణాలు బలైపోతున్నాయని కామారెడ్డి జిల్లా పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేశారు.

 

పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన డ్రైవర్స్‌ను కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తులు మొత్తం 42 మందికి శిక్షలు విధించారు. వీరిలో కొందరికి జైలు శిక్షలు, మరికొందరికి జరిమానాలు విధించబడ్డాయి.

 

దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 4 మందికి ఒక్క రోజు జైలు శిక్షతో పాటు ఒక్కోరికి ₹1,000 జరిమానా

 

కామారెడ్డి PS లో 2 మందికి ఒక్క రోజు జైలు + ₹1,000 జరిమానా

 

సదాశివనగర్ లో ఒకరికి, మాచారెడ్డి లో ఒకరికి ఒక్క రోజు జైలు + ₹1,000 జరిమానా

 

మొత్తం: కామారెడ్డి 13 మంది, దేవునిపల్లి 15 మంది, బీబీపేట్, భిక్నూర్, దోమకొండ PS పరిధుల్లో 2 మంది చొప్పున కలిపి 34 మందికి ₹34,000 జరిమానా విధించబడింది.

 

 

జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, IPS మాట్లాడుతూ —

 

> “మద్యం సేవించి వాహనం నడపడం వల్ల జరిగే ప్రమాదాలు కుటుంబాలను నాశనం చేస్తున్నాయి. ఎవరూ మద్యం సేవించి వాహనం నడపరాదు. మీ నిర్లక్ష్యం కారణంగా ఇతరులు ప్రాణాలు కోల్పోతున్నారు, కొందరు వికలాంగులవుతున్నారు. మీ భద్రత, ఇతరుల ప్రాణ భద్రత కోసం మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం మానుకోండి,” అని పిలుపునిచ్చారు.

 

 

జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, ప్రజల ప్రాణాలు కాపాడడమే పోలీసులు తీసుకుంటున్న ప్రతి చర్య వెనుక ఉన్న అసలైన లక్ష్యమని, ఎస్పీ తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment