Site icon PRASHNA AYUDHAM

బీసీలకు 42% రిజర్వేషన్ అమలుకు ఈనెల 18 రాష్ట్ర బంద్

IMG 20251015 WA0040

బీసీలకు 42% రిజర్వేషన్ అమలుకు ఈనెల 18 రాష్ట్ర బంద్

పిలుపునిచ్చిన బీసీ సంఘాలు

కరీంనగర్ అక్టోబర్ 15 ప్రశ్న ఆయుధం

బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలంటూ ఈనెల 18న రాష్ట్ర బంద్కు బీసీ సంఘాలు పిలుపునిచ్చాయి బుధవారం రోజున ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని బీసీ సంఘాల, కుల సంఘాల తోటి రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. బీసీ సంఘం నేతలు బీసీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు కామారెడ్డి లో బీసీ డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని మాట ఇచ్చారు. ఇప్పటికి రెండు సంవత్సరాలు గడుస్తుందని ఆ మాటకు కట్టుబడి 42 శాతం రిజర్వేషన్ అమలయ్యే విధంగా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఈనెల 18 తేదీన జరగబోయే బంద్ కు అన్ని పార్టీల నాయకులు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని బంద్ లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మేమెంతో మాకు అంత రిజర్వేషన్ కల్పించాలని అది అమలయ్యేంత వరకు పోరాటం చేస్తామని బీసీ సంఘం నేతలు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీసీ సంఘాల అధ్యక్షులు ఎన్నం ప్రకాష్ ఆది మల్లేశం నాయకులు నాగుల కనకయ్య గౌడ్, రాచమల్ల రాజు, నారోజు రాకేష్ చారి, కోడూరి పరశురామ్ గౌడ్, నర్సింగోజు శ్రీనివాస్, రంగు సంపత్ గౌడ్, మాచర్ల అంజయ్య, గంగిపెల్లి అరుణ, ఎడ్ల సురేందర్, ఆకుల సురేష్, చిగుర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version