42 మందికి నియామక పత్రాల అందజేత

– డిఎంహెచ్ఓ డా. బి. రాజశ్రీ చేతుల మీదుగా నియామక పత్రాల – పంపిణీ

నిజామాబాద్ సెప్టెంబర్ 24 (ప్రశ్న ఆయుధం)

జిల్లా కేంద్రం: జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో వివిధ క్యాడర్లకు ఎంపికైన అభ్యర్థులకు మంగళవారం నియామక పత్రాలు అందజేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. బి. రాజశ్రీ నియామక పత్రాలను అందజేశారు.

ఈ కార్యక్రమంలో మొత్తం 42 మందికి నియామక పత్రాలు అందాయి. వీరిలో నర్సింగ్ ఆఫీసర్లు/స్టాఫ్ నర్సులు – 30 మంది, ఆరోగ్య కార్యకర్తలు (ఏఎన్ఎం) – 3 మంది, ఫార్మసీ ఆఫీసర్లు – 9 మంది ఉన్నారు.

ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ మాట్లాడుతూ – “ప్రభుత్వ ఉద్యోగం ఒక బాధ్యత. ఓర్పు, క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి” అని హితవు పలికారు. ప్రజల ఆరోగ్య సంరక్షణలో ఉద్యోగుల పాత్ర అత్యంత కీలకమని ఆమె పేర్కొన్నారు.

అదే విధంగా డీడీఎం-1, డిస్ట్రిక్ట్ ఎపి డెర్మటాలజిస్ట్-1 పోస్టులకుగాను ధ్రువపత్రాల పరిశీలన పూర్తయినట్లు తెలిపారు. అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్లు-1, డేటా ఎంట్రీ ఆపరేటర్లు కమ్ అకౌంటెంట్లు-3, సపోర్టింగ్ స్టాఫ్-2 పోస్టుల భర్తీకి జిల్లా ఉపాధి కల్పన అధికారి ద్వారా ఏజెన్సీ నియామకం కోసం చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఆయా అభ్యర్థులను ఉద్యోగాల్లో నియమిస్తామని ఆమె తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏవో రాజేశ్వర్, సూపరిండెంట్ పద్మ, రామకృష్ణ, శ్రీకాంత్, జస్టిన్, చందన, సుజనా, గంగామణి, లతా, సంధ్య తదితర కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now