* పార్టీ పుట్టింది ఎక్కనీడో తెలుసా… రేగా కాంతారావు*
ప్రశ్నఆయుధం న్యూస్ అశ్వరావుపేట ఆర్సి
దమ్మపేట మండలంలోని జరిగిన టిఆర్ఎస్ పార్టీ సభలో
రేగ కాంతారావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తాన ని మాట్లాడుతున్నారు. అసలు ఈ రేగా కాంతారావు తన పార్టీ ఎక్కడ పుట్టిందో తెలుసా తెలంగాణ ఉద్యమకారుల సమాధుల మీద పుట్టిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఒక్క బి ఆర్ ఎస్ నాయకుడైన తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ప్రాణ త్యాగం చేశాడా కెసిఆర్ కుటుంబంలో ఒక్కరైనా తెలంగాణ కొరకు ప్రాణాలు విడిచారా. ఇలాంటి పార్టీ మాకు తెలుసు ఎక్కడ ఉండదు. కానీ మా కాంగ్రెస్ పార్టీ భారతదేశం కొరకు ప్రాణ త్యాగాలను చేసినటువంటి త్యాగమూర్తుల పార్టీ అని దేశమంతటా తెలుసు ఢిల్లీకి మూటలు మోస్తున్నారని అంటున్నారు. ఢిల్లీకి మూటలు మోసేది మీరు లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్నది మీరు మీ నాయకురాలు ఆ కేసులలో నుంచి ఎలా బయటపడాలో తెలియక ఢిల్లీ చుట్టూ తిరుగుతూ మూటలు మోసుకుపోయేది మీరు హామీల గురించి మాట్లాడుతున్నారు. మీరు దళితులకు ముఖ్యమంత్రి పదవి ఇస్తానన్నారు ఇచ్చారా ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు ఇచ్చారా డబుల్ బెడ్ రూమ్ అన్నారు ఇచ్చారా ఒక్కసారి ఆలోచించండి అందుకే ప్రజల మిమ్మల్ని ఓడించి ఇంటికి పంపించారు. మా సీఎం గురించి మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి జెడ్పిటిసి స్థాయి నుంచి ఎమ్మెల్యే ఆ తర్వాత సీఎం స్థాయి వరకు కష్టపడి ఎదిగారు అన్న సంగతి జగమెరిగిన సత్యం నీ అనుభవం ఎంత నీ రాజకీయ జీవితం ఎంత ఆలోచించుకో ఒకసారి ఎమ్మెల్యేలు భయపడుతున్నారు అంటున్నారు.ఎవరు భయపడేది భయపెట్టేవాడు మా ఎమ్మెల్యేలు భయపడేవారు కాదు మీ ఎమ్మెల్యే నీ పక్కన ఉన్న ఎమ్మెల్యే ప్రచారంలో ప్రజలు తిరగబడితే పారిపోయి దాక్కున్నటువంటి వ్యక్తి తెలుసా నీకు ఈరోజు కూడా మా ఎమ్మెల్యే శుభోదయం కార్యక్రమంలో భాగంగా రాచురిపల్లి పంచాయతీ మల్కారం పంచాయతీల్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకుని అప్పటికప్పుడు అధికారులను పిలిపించి సమస్యలను పరిష్కరిస్తున్నారు. మా అశ్వరావుపేట ఎమ్మెల్యే యంగ్ అండ్ డైనమిక్ జారే ఆదినారాయణ సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతమందికి అందించారో తెలుసా ఒక్కసారి లెక్క చూసుకో ఎంతమంది పేదలకు, హాస్పటల్ సౌకర్యాలను కల్పిస్తున్నారు. లెక్క చూసుకుంటే తెలుస్తుంది పిచ్చిపిచ్చిగా మాట్లాడితే ప్రజలు తరిమి కొడతారని తెలుసుకో అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దిశా కమిటీ సభ్యురాలు యేసుమణి, రేగా కాంతారావుని హెచ్చరించారు.