సోయా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
జుక్కల్ ఆర్సీ నవంబర్ 18 ప్రశ్న ఆయుధం
పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో సోయా కొనుగోలు కేంద్రాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ప్రారంభించారు..
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
ప్రభుత్వం సోయా పంటకు క్వింటాలుకు రూ.4,892/- మద్దతు ధర ప్రకటించిందని .
సమీప రైతులు అందరూ సోయా బీన్ పంటను పెద్ద కొడప్గల్ మార్కెట్ యార్డుకు తీసుకొచ్చి విక్రయించాలని కోరారు.
ఇంతకుముందు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ఎకరానికి ఆరు క్వింటాళ్లు మాత్రమే సేకరణ జరిగేదని..
తాను ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి ని కలిసి దీనిపై మాట్లాడటం జరిగిందని అన్నారు..
సోయా రైతుల సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లడం వల్ల ఎకరానికి పది క్వింటాళ్లు సేకరించాలని ఆదేశాలు జారీ చేశారని తెలిపారు.
కాబట్టి రైతులు అందరూ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే తమ పంటను విక్రయించాలని, దళారులను నమ్మి మోసపోవద్దు అని సూచించారు.
ఈ కార్యక్రమంలో అధికారులు,స్థానిక మండల నాయకులు, రైతులు,ప్రజలు పాల్గొన్నారు..