*3 దక్షిణాది రాష్ట్రాల్లోనే 43% బీటెక్ సీట్లు*
బీటెక్ సీట్లలో దక్షిణాది రాష్ట్రాలు అగ్రస్థానంలో నిలుస్తున్నాయి.దేశ వ్యాప్తంగా 14.90 లక్షల బీటెక్
సీట్లుండగా తమిళనాడు, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనే 42.80% (6,37,775 సీట్లు) ఉన్నాయి.
ఇంజినీరింగ్ విద్యలో కేరళ తప్ప దక్షిణాది రాష్ట్రాలు తొలి నుంచీ ముందంజలో ఉంటున్నాయి. గతేడాదితో పోల్చుకుంటే దేశంలో ఈసారి సీట్ల సంఖ్య గణనీయంగా పెరగగా వాటిలో తమిళనాడు,
ఏపీ, తెలంగాణల్లో పెరుగుదల అధికంగా ఉన్నట్లు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి గణాంకాలు
స్పష్టం చేస్తున్నాయి.