ప్రభుత్వం దృష్టి చేర్యాల వైపు మళ్ళించడానికి సంకల్ప దీక్ష
జేఏసీ చైర్మన్ డాక్టర్ ఆర్. పరమేశ్వర్
* ప్రజాసంకల్ప దీక్ష కరపత్రాలు ఆవిష్కరణ
ప్రభుత్వం దృష్టి చేర్యాల వైపు మళ్ళించడానికి ప్రజా సంకల్ప దీక్ష నిర్వహిస్తున్నట్లు జేఏసీ చైర్మన్ డాక్టర్ రామగల్ల పరమేశ్వర్ తెలిపారు. గురువారం చేర్యాల మండల కేంద్రంలోని జేఏసీ కార్యాలయంలో సంకల్ప దీక్షకు సంబంధించిన కరపత్రాలను జేఏసీ నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దశాబ్దాల తరబడి ఘనమైన చరిత్ర కలిగిన చేర్యాల ప్రాంతం గత కొంతకాలం నుండి అనేక ఒడిదుడుకులను ఎదుర్కోవడం కారణంగా బలమైన స్థానిక రాజకీయ నాయకత్వం లేకపోవడం కారణంగా నేడు తన ఉనికి అస్తిత్వమే ప్రశ్నార్ధకంగా మారిన దశలో ఈ ప్రాంత బిడ్డలుగా చేర్యాల ప్రాంతానికి పూర్వవైభవం మళ్లీ తీసుకురావడం కోసం ఈ ప్రాంత ప్రజలుగా ప్రజలతో మమేకమై రాజకీయ పార్టీలను ఒకే ఏజెండాపై తీసుకొచ్చి ఆ ఎజెండాలు ప్రజల ఎజెండాగా మార్చి రెవెన్యూ డివిజన్ సాధించి రానున్న రోజుల్లో 2026లోపు దిలిమిటేషన్ లో అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేసుకునే క్రమంలో ఈ నెల 30న నిర్వహించే ప్రజాసంకల్ప దీక్షకు సబ్బండ వర్గాల ప్రజలు ఆ దీక్షలో పాల్గొని బలమైనటువంటి ప్రజల ఆకాంక్షను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసమే ప్రజలు కదలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు పుర్మ ఆగం రెడ్డి, అంకుగారి శశిధర్ రెడ్డి, గిరి కొండల్ రెడ్డి, తోకల ఉమారణి, అందె అశోక్, అందె బీరయ్య, పిల్లి చంద్రం, చెరుకు రమణారెడ్డి, రామడుగు బాలరాజు, ఇర్రి ఉమాసురేశ్ రెడ్డి, చేటుకూరి కమలాకర్, పుర్మ సంజీవ రెడ్డి, తడక లింగమూర్తి, తాళ్లపల్లి రమేష్, ఆవుశర్ల యాదయ్య, ఎండీ. ఎక్బాల్, ఈరి భూమయ్య, కోల సాయిలు, ఎండీ. జహురద్దీన్, అంబటి అంజయ్య గౌడ్, కరెడ్ల రఘుపతి రెడ్డి, టీవీ నారాయణ, జంగిలి యాదగిరి, మంకాల నగేష్, వలబోజు నర్సింహా చారి, సనవాల ప్రసాద్, పాకాల ఇసాక్, కామల్ల అనిల్, గూడ రాజిరెడ్డి, బండి శ్రీనివాస్, ఆరుట్ల వినిత్, పుట్ట రమేష్, సిద్దిరాం భద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.