డిగ్రీ కళాశాలలో పుస్తకావిష్కరణ

డిగ్రీ కళాశాలలో పుస్తకావిష్కరణ

ప్రశ్న ఆయుధం, నవంబర్ 22, కామారెడ్డి 

కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అర్థశాస్త్ర అధ్యాపకులుగా పనిచేస్తున్న డాక్టర్ ఆకుల సుధాకర్ అసోసియేట్ ప్రొఫెసర్ రచించిన ఇండియాస్ డిజిటల్ ఎకానమీ గ్రోత్, చాలెంజెస్ అండ్ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ అనే పుస్తకాన్ని శుక్రవారం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె విజయ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ డాక్టర్ సుధాకర్ అర్థశాస్త్రంలో పరిశోధన చేస్తూ ఇప్పటికే అనేక వ్యాసాలను రచించారని అవి అర్థశాస్త్రాన్ని అభ్యసిస్తున్న విద్యార్థులకు, పరిశోధకులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని తెలియజేస్తూ డాక్టర్ సుధాకర్ ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కిష్టయ్య, అకాడమీక్ కోఆర్డినేటర్ విశ్వప్రసాద్, ఐక్యూ ఏసి కోఆర్డినేటర్ జయప్రకాష్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ దినకర్, డాక్టర్ గణేష్, డాక్టర్ రాజ గంభీర్ రావు, రాములు, రాజేందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now