వినాయక మండపాలకు 45 లడ్డూ ప్రసాదాల పంపిణి
ప్రశ్న ఆయుధం,సదాశివనగర్, ఆగస్టు 29
వినాయక చవితి సందర్బంగా శ్రీరామ రైతురాజ్యం సీడ్స్ & పెస్టిసైడ్స్ సంస్థ ప్రొప్రైటర్ జిల్లాల రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో 45 లడ్డూ ప్రసాదాల పంపిణీ జరిగింది. తిర్మన్‌పల్లి, మర్కల్, సదాశివనగర్, అడ్లూర్ ఎల్లారెడ్డి, కుప్రియల్, ధర్మారావుపేట్, కాళోజివాడి గ్రామాలలో గల గణపతి మండపాలకు లడ్డూలు అందజేశారు.ఈ సందర్భంగా జిల్లాల రమేష్ రెడ్డి మాట్లాడుతూ వినాయక చవితిని ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని, వినాయక ఆశీస్సులు ఎల్లప్పుడూ మనపై ఉండాలని ఆకాంక్షించారు.