మంగ్లీకి విశిష్ట పురస్కారం

మంగ్లీకి విశిష్ట పురస్కారం

హైదరాబాద్:

ప్రయివేటు సాంగ్స్‌తో తన కెరీర్ ప్రారంభించిన మంగ్లీ .. తన ప్రత్యేకమైన గొంతుతో తెలుగు ప్రజలను ఆకట్టుకున్నారు. ఫోక్, డివోషనల్, ఐటం సాంగ్ ఇలా ఏదైనా అవలీలగా పాడుతూ ప్రేక్షకుల హృదయాలను రంజిపజేస్తున్నది. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా ప్రతి సాంగ్‌లోనూ తనదైన ముద్ర వేసుకుంటున్నారు. జార్జి రెడ్డి సినిమాలోని రాయల్ ఎన్ఫీల్డ్ సాంగ్‌తో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న మంగ్లీ.. అక్కడ నుండి తన గ్రాఫ్ అంతకంతకూ పెంచుకుంటూ వెళుతోంది. అల వైకుంఠపురం మూవీలో రాములో రాములా, లవ్ స్టోరీ చిత్రంలోని సారంగదరియాతో పాటు అనేక పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆమెతో పాడించిన పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దీంతో ఆమెతో సాంగ్స్ పాడించేందుకు ఎక్కువ మంది సినీ దర్శకులు సిద్దమవుతున్నారు. ఈ క్రమంలోనే సంగీత ప్రపంచానికి ఆమె అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఇటీవల సంగీత నాటక అకాడమి నుంచి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారానికి ఎంపికైంది. ఆమె ఆదివారం న్యూఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment