కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల అదనపు గదుల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే.

కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల అదనపు గదుల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే.

నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం చారగొండ మండల కేంద్రంలో 

కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం అదనపు గదులకు నిర్మాణానికి ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ సోమవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్య సంక్షేమం కొరకై అధిక నిధులు కేటాయిస్తూ పాఠశాలల బలోపేతం మీ లక్ష్యంగా విద్యార్థులకు కావలసినటువంటి అన్ని రకాల వసతులు సమకూరుస్తుందని

గత కొద్ది రోజుల క్రితమే రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు డైట్ మెస్ ఛా ర్జీలు పెంచడం జరిగిందని అవునా విద్యార్థులు అందరూ కూడా కష్టపడి చదువుతూ ప్రతి ఒక్కరు ఉన్నత లక్షలకు చేరుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యార్థులకు సూచించారు.కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఎటువంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తామని హామీ ఇస్తున్నాం అని అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వెంకట్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు బలరాం గౌడ్, గురువయ్య , విజేందర్, ప్రజా ప్రతినిధులు అధికారులు కేజీబీవీ అధికారులు, సిబ్బంది, స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment