*డిసెంబర్ 15 ఆమరణ నిరాహార దీక్ష చేస్తా*
* ఆధారాలున్న చర్యలు తీసుకోవడం లేదు
* అక్రమాలను పెంచి పోషిస్తున్నా ఉన్నతాధికారులు
* సిద్దిపేట మున్సిపల్ గేటు ముందు ఆమరణ నిరాహార దీక్ష.
సిద్దిపేట మున్సిపాలిటీ లో పని
చేస్తున్న అధికారి అక్రమంగా పదోన్నతి పొందిన ఉన్నతాధికారులు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని తన వద్ద ఉన్న ఆధారాలు అధికారులకు అందించిన చీమ కుట్టినట్టు కూడ లేదని ఆర్టీఐ కార్యకర్త షాదుల్ విమర్శించారు. సోమవారం ఆయన ప్రకటన విడుదల చేశారు.అక్రమంగా పదోన్నతి పొందిన అధికారిని వెనుకేసుకొస్తున్న జిల్లా కలెక్టర్,మున్సిపల్ కమిషనర్ ఉన్నతాధికారుల చర్యలకు నీరసనగ డిసెంబర్ 15 సిద్దిపేట మున్సిపల్ కార్యాలయం ముందు ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు. అక్రమంగా పదోన్నతి పోంది ప్రజల సొమ్మును జీతం గా తీసుకుంటున్నా ఉన్నతధికారులు చూసి చూడకుండా ఉండడం సిగ్గు చేటు అన్నారు. ఆ అధికారి అక్రమంగ పదోన్నతి పొందినట్టు తన దగ్గర ప్రతి ఒక్క ఆధారం ఉందని వాటిని జిల్లా కలెక్టర్ కె కాకుండా హైదరాబాద్ లోని సీడీఎంఏ కార్యాలయంలో కూడా అందించానని తెలిపారు. అధికారిపై చర్యలు తీసుకోవడానికి నిర్లక్ష్యం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. అతని పై చర్యలు తీసుకోవడమే కాకుండా తీసుకున్న జీతం రికవరీ చేసేదాకా అలాగే అక్రమంగా పదోన్నతి పొందినందుకు ఆయనపై, ఆయనకు సహాకరించిన అధికారులపై కేసులు నమోదు చేసేవరకు పోరాడుతానన్నారు.