పద్మశాలి యువత ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
కోరుట్ల పట్టణంలోని పద్మశాలి కులోన్నతి సంక్షేమ సంఘంలో
పద్మశాలి యువత ఆధ్వర్యంలో మమత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సహకారంతో ఆదివారం నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిభిరం విజయవంతమయ్యింది. ముఖ్య అతిథిగా జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ నీలం శ్రీనివాస్ పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ నీలం శ్రీనివాస్ మాట్లాడుతూ చలికాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి వ్యాధుల నుండి కాపాడుకోవాలని, డెంగ్యూ, చికెన్ గున్యా బారిన పడకుండా దోమలు నివసించే నీటి నిల్వలు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చలికాలంలో దమ్ము, దగ్గు వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలకు అవసరమయ్యే ఉచిత వైద్య శిబిరం యువత ఆధ్వర్యంలో నిర్వహించడం అభినందనీయం అన్నారు. ప్రజలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, ఆరోగ్యం కాపాడుకోవాలని సూచించారు. మమత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ మిట్టపల్లి రాజేష్ మాట్లాడుతూ ఇప్పుడు అంతా వైరల్ జ్వరాల సీజన్ నడుస్తుందని, పది సంవత్సరాల లోపు పిల్లలు జ్వరాల బారినపడకుండా ద్రవ పదార్థాలు,cవిటమిన్లు ఎక్కువ ఉండే ఆహారం తీసుకోవాలన్నారు. చలికాలంలో చిన్నపిల్లలు జలుబు, దగ్గు బారిన పడే అవకాశం ఎక్కువ ఉంటుందని, చిన్నపిల్లలకు వెచ్చటి దుస్తులు ధరించాలని, ఇంట్లో గదుల టెంపరేచర్ కూడా వెచ్చగా ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. డాక్టర్ సంతోష్ కుమార్, డాక్టర్ మధు శ్రీలు మాట్లాడుతూ ఇలాంటి పెద్ద శిబిరాల్లో పాల్గొని ఉచితంగా వైద్య సేవలు చేయడానికి ఎల్లప్పుడూ ముందుంటామని, యువత ఆధ్వర్యంలో
నిర్వహించే ఉచిత వైద్య శిబిరంలో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహించడం హర్షణీయమని కొనియాడారు. శిబిరంలో సుమారు 500 మందికి ఉచితంగా వైద్యపరీక్షలు, రక్త పరీక్షలు, తదితర పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేసినట్లు యువత ఆద్యక్షుడు జక్కుల ప్రవీణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షులు గుంటుక ప్రసాద్, జిల్లా అధ్యక్షులు రుద్ర శ్రీనివాస్, యువత అధ్యక్షులు జక్కుల ప్రవీణ్ కుమార్, మున్సిపల్ కౌన్సిలర్లు ఎంబేరి నాగభూషణం, పెండెం గణేష్, పోపా అధ్యక్షులు అందే శివప్రసాద్, కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహ కమిటీ అధ్యక్షులు ముల్క ప్రసాద్, నాయకులు గడ్డం మధు, యువత కార్యవర్గం బండి సురేష్, చింతగింది ప్రేమ్, రాడం మహేందర్, రుద్ర విగ్నేష్, కటకం శివకుమార్, గాజెంగి మనీష్, పద్మశాలి సంఘం కార్యవర్గం బండ్ల రవికుమార్, గోసికొండ కుమారస్వామి, అందే రాజ్ కుమార్, రుద్ర సురేష్, పడాల గణేష్, ఎక్కలి దేవి రామచంద్రం, నల్ల ప్రశాంత్, దైవశెట్టి వంగరి గణేష్, అల్లే లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.