ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో వేగం పెంచాలి.

ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో వేగం పెంచాలి.

హౌసింగ్ సెక్రెటరీ జ్యోతి బుద్ధ ప్రకాష్.

ఇందిరమ్మ ఇండ్ల సర్వే పైలెట్ ప్రాజెక్టు ను పరిశీలించిన హౌసింగ్ సెక్రెటరీ జ్యోతి బుద్ధ ప్రకాష్.

సోమవారం హవేలీ ఘన్పూర్ మండలం లింగసాన్ పల్లి గ్రామంలో,నర్సాపూర్ పట్టణంలోని 5వ వార్డులో ఇందిరమ్మండ్ల సర్వే తీరును కలెక్టర్ రాహుల్ రాజ్ తో హౌసింగ్ సెక్రటరీ జ్యోతి బుద్ధ ప్రకాష్ పరిశీలించారు.ఈ సందర్భంగా హౌసింగ్ సెక్రెటరీ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో వేగం పెంచాలన్నారు.ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో తెలంగాణ రాష్ట్రంలో పైలెట్ ప్రాజెక్టు కింద మెదక్ జిల్లా లోని హవేలీ ఘన్పూర్ మండలం లింగ్ సాన్ పల్లి,నర్సాపూర్ పట్టణంలోని 5 వ వార్డులో ఇందిరమ్మ ఇండ్ల యాప్ ద్వారా సర్వే తీరును అడిగి తెలుసుకున్నారు.లింగ్ సాన్ పల్లి గ్రామం, నర్సాపూర్ మున్సిపాలిటీలో వార్డ్ నెంబర్-05 లో ఇందిరమ్మ ఇండ్ల సర్వే వేగం పెంచాలని,తెలంగాణలో ఇండ్లు లేని నిరుపేదలకు తొలిదశలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. 

ఈ కార్యక్రమంలో ఈఈపిఆర్ నరసింహులు,ఎంపీడీవో రవీశ్వర్ గౌడ్,తాహాసిల్దార్ సింధూ, రేణుక, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment