నిర్దిష్ట సమయంలో ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలి….. సీఎం రేవంత్ రెడ్డి

పత్రిక ప్రకటన

నిర్దిష్ట సమయంలో ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలి….. సీఎం రేవంత్ రెడ్డి*

*సన్నాలకు బోనస్ అందిస్తున్నందున దొడ్డు ధాన్యం అందులో కల్వకుండా జాగ్రత్తలు పాటించాలి*

**సకాలంలో బియ్యం సరఫరా చేయని మిల్లర్లపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి*

**ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల వ్యవధిలో రైతులకు చెల్లింపులు*

*ధాన్యం కొనుగోలుపై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన సీఎం*

ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ సంబంధించి నిర్దిష్ట సమయంలో ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 

మంగళవారం ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2024-25 కు సంబంధించి ధాన్యం కొనుగోలుపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఆన్లైన్ ద్వారా రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణా రావు, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పాల్గొన్నారు.

ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ ధాన్యం కొనుగోలు సంబంధించిన అంశాలను వివరిస్తూ ఉన్నతాధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ధాన్యం కొనుగోలులో పాటించాల్సిన నాణ్యత ప్రమాణాలు, సన్న రకం దాన్యం కొనుగోలుకు 500 రూపాయల బోనస్ తదితర అంశాలను వివరించారు. 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి* మాట్లాడుతూ, రైతులు గతంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అకాల వర్షాలు కురిస్తే రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని, నిర్దిష్ట సమయంలో ధాన్యం సేకరణ పూర్తి కావాలని, సేకరించిన వాటికి చెల్లింపులు పూర్తి చేయాలని తెలిపారు. 

గతంలో లేని విధంగా విధంగా ఈసారి సన్నాలకు బోనస్ చెల్లిస్తున్నామని, దొడ్డు బియ్యం వచ్చి సన్నాలలో కలిస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని, మిల్లులకు పంపే సమయంలో ఏ రకం బియ్యం పంపిస్తున్నమో క్లారిటీ ఉండాలని, జిల్లా కలెక్టర్ లు ప్రత్యేకంగా దృష్టి పెట్టీ అధికారులకు ఇన్చార్జి లుగా బాధ్యతలు అప్పగించి సజావుగా ధాన్యం కొనుగోలు జరపాలని సూచించారు. 

ధాన్యం సరైన సమయంలో ఇవ్వని మిలర్ల పై అవసరమైతే సివిల్ సప్లై యాక్ట్, ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాలని అన్నారు. ధాన్యంలో తాలు, తేమ పేరుతో కోత విధించే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. దొడ్డు రకం బియ్యాన్ని సన్న రకంగా తారుమారు చేసే వారిపై, గతంలో తీసుకున్న ధాన్యం మిల్లింగ్ చేసి ఇవ్వకుండా, బ్యాంక్ గ్యారంటీ లు ఇవ్వని మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని, వారి పై స్పష్టత తో ముందుకెళ్లాలని కలెక్టర్ లకు సూచించారు.

నవంబర్ 30వ తారీఖున మహబూబ్ నగర్ జిల్లాలో రైతు పండుగ చేసుకుంటున్నామని, ఈలోగా గరిష్టంగా ధాన్యాన్ని సేకరించి, బోనస్, చెల్లింపులు పూర్తి చేయాలని అన్నారు. గన్ని బ్యాగుల సమస్య రాకుండా జాగ్రత్త పడాలని, ఇంచార్జి జిల్లా మంత్రులు తమకు కేటాయించిన ఉమ్మడి జిల్లాలో ధాన్యం సేకరణలో వచ్చే సమస్యలను ఉమ్మడి జిల్లాల ప్రత్యేక అధికారులు, కలెక్టర్ లతో సమన్వయం చేసుకొని ప్రతిరోజూ ఎప్పటి కప్పుడు రిపోర్ట్ లు తెప్పించుకొని పరిష్కరించాలని సూచించారు. 

సంక్షేమ హాస్టల్ లకు, రెసిడెన్షియల్ పాఠశాలలు, చౌక ధరల దుకాణాలకు సన్న రకం బియ్యం అందిస్తామని చెప్పడం జరిగిందని, అందుకు గాను 36 లక్షల మెట్రిక్ టన్నుల సన్న రకం ధాన్యం అవసరం ఉంటుందని, అందుకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ, కొనుగోలు చేసిన ధాన్యం ట్యాబ్ ఎంట్రీలు త్వరగా చేయాలని, సన్న వడ్లు కొనుగోలు చేసిన రైతులకు రూ.500/- బోనస్ చెల్లింపులు జరిగేలా చూడాలని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు విజయోత్సవాలను ఘనంగా నిర్వహించాలని అన్నారు. 

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు శ్రీనివాస్ రెడ్డి, వి.విక్టర్, ఆర్డీఓ రంగనాథ్ రావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

 

Join WhatsApp

Join Now

Leave a Comment