సంగారెడ్డి ప్రతినిధి, ఏప్రిల్ 22 (ప్రశ్న ఆయుధం న్యూస్): మంగళవారం విడుదల చేసిన తెలంగాణ మొదటి సంవత్సరం ఇంటర్మిడియట్ ఫలితాలలో సదాశివపేట మండలం బాబిల్గావున్ గ్రామ విద్యార్థిని గాయత్రి 470 మార్కులకు గాను 468 మార్కులు సాధించింది.ఈ విద్యార్థిని 2023-24వ సంవత్సరంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాబిల్గావున్ లో చదివి 9.7 జీ.పీ.ఏ సాధించింది. రాష్ట్ర స్థాయి గణిత టాలెంట్ పరీక్షల్లో రెండవ స్థానం పొందింది.ప్రస్తుతం ఇంటర్మీడియట్ (గురుకుల రెసిడెన్సి కళాశాల) టి.జి ఎస్.ఆర్.జె.సి హొతి కే జహీరాబాద్ లో చదువుచున్నది. ఈ సందర్భంగా గాయత్రీని బాబిల్గావున్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నాగభూషణం, ఉపాధ్యాయ బృందం అభినందించింది. ఈ సందర్భంగా నాగభూషణం మాట్లాడుతూ గ్రామాల్లో కూడా ఆణిముత్యాలు ఉంటారన టానికి ఇది నిదర్శనం అని అన్నారు. అనంతరం విద్యార్థి గాయత్రీని ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు.
బాబిల్గావున్ గ్రామ విద్యార్థి గాయత్రికి 468 మార్కులు..అభినందనలు తెలిపిన ఉపాధ్యాయులు
Published On: April 22, 2025 7:43 pm
