Site icon PRASHNA AYUDHAM

దళితుల భూములు గుంజుకోని మా కుటుంబాలను ఆగం చేయొద్దు

దళితుల భూములు గుంజుకోని మా కుటుంబాలను ఆగం చేయొద్దు

భారత్ బయోటెక్ ప్రతినిధుల మంటూ బెదిరింపులు 

మర్కుక్ నవంబర్ 28 ప్రశ్న ఆయుధం :

భారత్ బయోటెక్ కంపెనీకి దళిత రైతుల విన్నపం 

మర్కుక్ మండలం మండలం కరకపట్ల గ్రామానికి చెందిన పాలె నరసయ్య 1965 నుండి 285 సర్వేనెంబర్ లో మూడు ఎకరాల భూమిని సాగు చేసుకుంటున్న మని భారత్ బయోటెక్ కంపెనీ ప్రతినిధుల పేరుతో కొందరు మధ్యవర్తులు తమను భయభ్రాంతులకు గురిచేసి ఇబ్బందులకు గురి చేస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దళిత కుటుంబానికి చెందిన తమకు ఆ భూమి తప్ప మరే భూమి లేదని రెవెన్యూ అధికారులు గ్రామానికి చెందిన బ్రోకర్లు కలిసి 2017 నుండి ఇప్పటివరకు ఏడు ఎనిమిది సార్లు సర్వే నోటీసులు ఇచ్చారన్నారు. పైన కంపెనీ యాజమాన్యానికి తెలవకుండా ఇక్కడ ఉండే బ్రోకర్లు తమ భూమిని అమ్ముతామంటూ డబ్బులు నొక్కేసారని ఇప్పుడు ఒత్తిడికి గురిచేస్తూ ఇబ్బందుల చేస్తున్నారని వాపోయారు. ఈ భూమిని నమ్ముకొని బ్రతుకుతున్న తమ కుటుంబాన్ని రోడ్డు కిడ్చొద్దని జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.

Exit mobile version