బాధితుడికి రూ.5 లక్షల ఎల్ఓసి అందజేత..!

బాధితుడికి రూ.5 లక్షల ఎల్ఓసి అందజేత..!

జనగామ జిల్లా: పాలకుర్తి మండలం శాతాపురం గ్రామానికి చెందిన కొండూరి నర్సయ్య అనారోగ్య సమస్యతో బాధపడుతూ.. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యానికి పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం పడగా విషయాన్ని స్థానిక కాంగ్రెస్ నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన వారు ఎమ్మెల్యే యశశ్విని రెడ్డి కృషితో రూ.5 లక్షల ఎల్ఓసిని మంజూరు చేయించి, నేడు బాధిత కుటుంబ సభ్యులకు అందించి మానవత్వం చాటుకున్నారు. వారికి బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కసరబోయిన కృష్ణమూర్తి, మాజీ సర్పంచ్ పసులాది వెంకటేష్, మాజీ ఉపసర్పంచ్ మారుజోడు సంతోష్, మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లోనే శ్రీనివాస్ తదితరులున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment