ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిన
50 మంది కాంగ్రెస్ నేతలు
ప్రశ్న ఆయుధం మార్చి12: కూకట్‌పల్లి ప్రతినిధి
బుధవారం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమక్షంలో హైదర్ నగర్ నుండి బాల్ రెడ్డి హనుమాన్ రెడ్డి ఆధ్వర్యంలో 50 మంది కాంగ్రెస్ నేతలు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన తర్వాత పదేళ్ల కాలంలో జరిగిన అభివృద్ధిని కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత ఈ సంవత్సర కాలంలో జరుగుతున్న విధ్వంసాన్ని ప్రజలు గమనించారని మళ్లీ అభివృద్ధికే పట్టం కట్టాలన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నాయకత్వంలో కూకట్పల్లి నియోజకవర్గాన్ని మరియు శేరిలింగంపల్లి అభివృద్ధి కొరకు బిఆర్ఎస్ పార్టీలో చేరామని అన్నారు.
రాజేష్, నాగరాజు, నగేష్, రవీందర్ శ్రీనివాస్ రెడ్డి , దొరబాబు, రవళి , దుర్గ భవాని బిఆర్ఎస్ పార్టీలో చేరినారు.