Jul 10, 2025, యూనివర్సిటీలో తెలంగాణ విద్యార్థులకే 50% సీట్లు: పొంగులేటి
తెలంగాణ : రాష్ట్రంలో రెండు విద్యాసంస్థలను యూనివర్సిటీలుగా మార్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. అమిటీ, సెంటినరీ రీహాబిలిటేషన్ ఇనిస్టిట్యూట్‌లను యూనివర్సిటీలుగా మార్చేందుకు అనుమతి ఇచ్చామని తెలిపారు. యూనివర్సిటీలో తెలంగాణ విద్యార్థులకే 50 శాతం సీట్లు కేటాయిస్తామన్నారు. గోవుల సంరక్షణ కోసం గోశాల పాలసీని తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలిపారు.