రోడ్డు పక్కన 52 KGల బంగారం, రూ.10 కోట్ల డబ్బు..
భోపాల్ (MP)లోని ఓ కారులో ఏకంగా 52 కేజీల బంగారం, రూ.10 కోట్ల నగదు దొరకడం సంచలనంగా మారింది. అడవిలో ఓ కారు పార్క్ చేసి ఉండటంతో పోలీసులు సీజ్ చేశారు. అందులోని బంగారం, డబ్బు చూసి వారి మైండ్ బ్లాంక్ అయింది. రూ.42 కోట్ల విలువైన పసిడి, రూ.10 కోట్ల నోట్ల కట్టలు దొరికాయి. వాటిని తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఇటీవల ఐటీ శాఖ రైడ్స్ చేస్తుండటంతో అనుమానం రాకుండా ఇలా వదిలేసి ఉండొచ్చని భావిస్తున్నారు.