మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా నీరడి లక్ష్మణ్ నియామకం…

నిజామాబాద్ జిల్లా ( ప్రశ్న ఆయుధం ) జిల్లా ప్రతినిధి డిసెంబర్ 16

మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా నిజామాబాద్ జిల్లాకు చెందిన నీరడి లక్ష్మన్న నియమించారు. ఈ మేరకు సోమవారం మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా నియామక పత్రాన్ని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవి చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..భారత రాజ్యాంగంలో షెడ్యూల్ కులాలకు పొందుపరిచిన హక్కుల పరిరక్షణ ఉద్యమంలో వర్గీకరణ వ్యతిరేకిస్తూ డాక్టర్: బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో గత కొన్ని సంవత్సరాలుగా క్రియాశీలక కార్యకర్తగా మాల మహానాడు సంస్థలో పనిచేయుచున్న నీరడి లక్ష్మన్ను నియమించారు. వీరి పదవికాలం 2 రెండు సంవత్సరాల వరకు కొనసాగుతారు. మూడు నెలల కాలంలో రాష్ట్ర కమిటీలు జిల్లా కమిటీలను వేయాలని సూచించారు అని తెలియజేశారు. మాల మహానాడు జాతీయ కమిటి ఆదేశాల మేరకు మంచి క్రమ శిక్షణతో పనిచేయాలి. క్రమశిక్షణ ఉల్లంఘించినచో వారిని పదవి నుండి తొలగించే అధికారం జాతీయ కమిటికి ఉంటుందని తెలిపారు.

Join WhatsApp

Join Now