అంగన్వాడి కేంద్రాలు ఏర్పాటు చేయాలని వినతి

అంగన్వాడి కేంద్రాలు ఏర్పాటు చేయాలని వినతి

ప్రశ్న ఆయుధం 21 డిసెంబర్ ( బాన్సువాడ ప్రతినిధి )

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని మిస్రిగల్లి,టీచర్స్ కాలనీ,బీడీ వర్కర్స్ కాలనీ,మదీనా కాలనీ,ఇస్లాంపుర, బండగల్లి ప్రాంతాల్లో అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కాలనీ వాసులు కోరారు.ఈ మేరకు శనివారం బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయికి వినతిపత్రం ఇచ్చారు. అంగన్వాడీ కేంద్రాలు లేక గర్భిణులు,బాలింతలు చిన్నపిల్లలు ఇబ్బందులకు గురవుతున్నారని.. అంగన్ వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసి సమస్య పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ వార్డు మెంబర్ షేక్ అక్బర్,లాయక్, రహీం,అబ్దుల్ ఖాదర్,అంబర్ సింగ్, ఇర్ఫాన్ ఖురేషి,అక్రమ్ పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now