కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈఓ నాగేశ్వర్ రావు

ప్రశ్న ఆయుధం 30 డిసెంబర్ ( బాన్సువాడ ప్రతినిధి )

బాన్సువాడ మండలంలోని కొత్తబాది కస్తూరిబా పాఠశాలను ఎంఈఓ నాగేశ్వరరావు తనిఖీ చేశారు.స్టోర్ రూమ్ లో గల కూరగాయలను పరిశీలించి, వంటశాలను తనిఖీ నిర్వహించారు.కూరగాయలను ఎప్పటికప్పుడు తాజాగా ఉంచాలని ఆయన తెలిపారు.అనంతరం విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టాలని ఎంఈఓ సూచించారు. సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులు గత 20 రోజుల నుండి ధర్నా చేయడం విధితమే.విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలేత్తకుండా ఉండేందుకు తాత్కాలిక ఉపాధ్యాయులను నియమించినట్లు ఎంఈఓ నాగేశ్వరరావు తెలిపారు.

Join WhatsApp

Join Now