కామారెడ్డిలో మద్యం షాపుల కోసం 57 దరఖాస్తులు

కామారెడ్డిలో మద్యం షాపుల కోసం 57 దరఖాస్తులు

స్టేషన్ వారీగా కౌంటర్లను పరిశీలించిన ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) అక్టోబర్ 8

కామారెడ్డి జిల్లాలోని మద్యం షాపుల కోసం ఇప్పటివరకు మొత్తం 57 అప్లికేషన్లు అందాయని ఉమ్మడి జిల్లా ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి తెలిపారు. బుధవారం ఆయన కామారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసిన దరఖాస్తుల స్వీకరణ కౌంటర్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామారెడ్డి స్టేషన్ పరిధిలో 12, దోమకొండ స్టేషన్ పరిధిలో 6, ఎల్లారెడ్డి స్టేషన్ పరిధిలో 3, బాన్సువాడ స్టేషన్ పరిధిలో 15, బిచ్కుంద స్టేషన్ పరిధిలో 21 దరఖాస్తులు అందాయని తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ పారదర్శకంగా కొనసాగుతున్నదని, ఎలాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా అధికారులు పర్యవేక్షణ చేపట్టారని వివరించారు.

 

ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి హనుమంతరావు, ఆయా స్టేషన్ల ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now