Site icon PRASHNA AYUDHAM

ప్రజావాణికి 57 ఫిర్యాదులు: డీఆర్ఓ పద్మజారాణి

IMG 20250804 181425

Oplus_0

సంగారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 4 (ప్రశ్న ఆయుధం న్యూస్): ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికివచ్చిన ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని డీఆర్ఓ పద్మజారాణి అధికారులకు ఆదేశించారు. సోమవారం జిల్లా కల్లెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 57 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను డీఆర్ఓ పద్మజ రాణి, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి, జడ్పీ సీఈఓ జానకి రెడ్డి, పిడి డిఆర్ డిఓ జ్యోతిలకు విన్నవిస్తూ వివిధ సమస్యలకు సంబందించి ఫిర్యాదులు సమర్పించారు. ప్రజా ఫిర్యాదులను సంబంధిత అధికారులు పెండింగ్ లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులపై చేపట్టిన చర్యలను వివరిస్తూ ఫిర్యాదు దారులకు సమాచారం తెలియజేయాలని సూచించారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, సెక్షన్ సూపరింటెండెంట్స్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version