గంజి గుమాస్తల సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటు
ప్రశ్న ఆయుధం – కామారెడ్డి
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గంజిలో గుమస్తాలుగా పనిచేస్తున్న వారు తమ నూతన కార్యవర్గాన్ని సోమవారం జిల్లా కేంద్రంలోని గంజి వర్తక సంఘం కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసుకొని నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా లక్డే మోహన్ రావు, ఉపాధ్యక్షులుగా ఏ రాజేందర్రావు, కార్యదర్శిగా గోపు సంతోష్, సహాయ కార్యదర్శిగా పయ్యావుల శ్రీనివాస్, కోశాధికారిగా పాత ప్రకాష్, కార్యవర్గ సభ్యులుగా ఏలేష్ యాదవ్, ఆర్కిటీ సంజీవరెడ్డి, దేవుని వెంకటేశం, ఆకుల రవీందర్, కళాలి లక్ష్మారెడ్డి, రాజిరెడ్డి, కె చంద్రమౌళి, అంజయ్య తదితరులను ఎన్నుకున్నారు.ఇ కార్యక్రమం లో సభ్యులు ఎల్లష్, గంగరాజు, బాపురావు, రాజీ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.