వాట్సాప్‌లో ‘హాయ్’ పంపితేనే 580 ప్రభుత్వ సేవలు అందుబాటులోకి
— మీ-సేవ కొత్త సౌకర్యాన్ని మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం నవంబర్ 18
ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయడానికి మీ-సేవ సేవలను వాట్సాప్ ప్లాట్‌ఫారమ్‌లో ప్రారంభించినట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. 38 ప్రభుత్వ విభాగాలకు చెందిన 580కు పైగా సేవలను ఇప్పుడు వాట్సాప్ ద్వారా పొందవచ్చని తెలిపారు. 80969 58096 నంబర్‌కు Hi పంపితే ఇన్‌కం, క్యాస్ట్, బర్త్, డెత్ సర్టిఫికెట్ దరఖాస్తులతో పాటు విద్యుత్, నీటి బిల్లులు, ఆస్తి పన్నులు వంటి సేవలు కూడా సులభంగా పొందవచ్చు.