దివ్యాంగుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐఏఎస్ స్మిత సబర్వాల్ పై చర్యలు తీసుకోవాలని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వున్నాం బ్రహ్మయ్య డిమాండ్ చేశారు.దివ్యాంగులు చేపడుతున్న దీక్ష శిబిరాన్ని సందర్శించి వారికి సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల ఆత్మగౌరాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన ఆమెపై చర్యలు తీసుకోవాలని లేకుంటే బిఆర్ఎస్ పార్టీ తరఫున ఆందోళన తీవ్రతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మాజి జెడ్పీ వైస్ చైర్ పర్సన్ మరికంటి ధనలక్ష్మి, నేలకొండపల్లి మండల యూత్ అధ్యక్షుడు గొలుసు రవి,BRS పార్టీ నేలకొండపల్లి మండల సోషల్ మీడియా అధ్యక్షుడు మాదాసు ఆదాం, ఖమ్మం కాంతారావు,TDjAC అధ్యక్షుడు పసుపులేటి చలమయ్య, మండల బీఆర్ఎస్ ఉద్యమకారుడు మరికంటి వేణుబాబు, సూరయ్య, తదితరులు పాల్గొన్నారు..