CMRF స్కాంపై 6 కేసులు నమోదు..
తెలంగాణలో సీఎం రిలీఫ్ ఫండ్ స్కాంపై సీఐడీ 6 కేసులు నమోదు చేసింది. వైద్యం చేయకుండానే నకిలీ బిల్లులతో డబ్బులు దండుకున్న 30 అస్పత్రులపై కేసులు నమోదు చేశారు. హైదరాబాద్, ఖమ్మం, నల్గొండలోని ఆస్పత్రుల్లో ఈ స్కాం జరిగినట్లు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.