డ్రంకన్ డ్రైవ్‌లో 20 మందిపై చర్య
6 మందికి వారం రోజుల జైలు శిక్ష – 14 మందికి రూ.1.41 లక్షల జరిమానా
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి నవంబర్ 18 (ప్రశ్న ఆయుధం) : మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశాల మేరకు నవంబర్ 18, 2025 న ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ పి. ప్రసాద్ ఆధ్వర్యంలో డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడిన 20 మందికి కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం వారిని సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ నూర్జాన్ ఎదుట హాజరుపర్చగా…
14 మందికి ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున మొత్తం రూ.1,41,000 జరిమానా విధించారు.
అదే కేసులో 6 మందికి వారం రోజులపాటు జైలు శిక్షలు విధించారు.
జైలు శిక్షకు గురైన వారు…
1. మధ్య రమేష్ (42), తండ్రి సాయిలు, బాన్సువాడ
2. షేక్ సల్మాన్ (27), తండ్రి షేక్ కరీం, ఇస్సపల్లి
3. కుమ్మరపల్లి సాయికుమార్ (26), తండ్రి ఉష అన్న, సాంపల్లి
4. నర్మల రాములు (54), తండ్రి మారుతి, ధర్మారం
5. మల్కాజీ అనిల్ (36), తండ్రి ప్రహ్లాద్, మామిడిపల్లి
6. శంకర్ చౌహాన్ (30), తండ్రి లాల్, ముక్కల్
ట్రాఫిక్ పోలీసులు ప్రజలను హెచ్చరిస్తూ… మద్యం మత్తులో వాహనాలు నడపడం తమ ప్రాణాలకే కాక ఇతరుల ప్రాణాలకు ప్రమాదకరమని, ఇలాంటి ప్రత్యేక డ్రైవ్‌లు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు.