ప్రజావాణిలో 60 దరఖాస్తులు స్వీకరణ

ప్రజావాణిలో 60 దరఖాస్తులు స్వీకరణ

ప్రతి దరఖాస్తుపై తక్షణ చర్యలు తీసుకోవాలి 

:జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

కామారెడ్డి జిల్లా ప్రతినిధి,ప్రశ్న ఆయుధం డిసెంబర్‌ 22

ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజావాణిలో మొత్తం 60 దరఖాస్తులు స్వీకరించినట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తైన అనంతరం ప్రజావాణి కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగిస్తున్నట్లు చెప్పారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి, సంబంధిత శాఖల అధికారులకు అందజేసి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

రెవెన్యూ, డీడబ్ల్యూఓ (DWO), వ్యవసాయం, విద్య, వైద్యం, పెన్షన్లు తదితర శాఖలకు సంబంధించిన మొత్తం 60 దరఖాస్తులు ఈ ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించినట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్మయి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రవితేజ, జడ్పీ సీఈఓ చందర్‌తో పాటు జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment