*ఏపీలో నామినేటెడ్ పదవులకు 60 వేల దరఖాస్తులు!*
అమరావతి :
ఏపీలో తొలి విడతలో పదవులు రాలేదని ఎవరూ ఏమీ అనుకోవద్దని..రెండేళ్ల పదవీకాలం ముగిసిన తర్వాత మిగిలిన వారికీ ఆ పదవుల్లో అవకాశాలు కల్పిస్తామని పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. ‘ఇప్పటికే పదవులు తీసుకున్న వారి పనితీరును పర్యవేక్షిస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా 21 ప్రధాన దేవాలయాలకు ఛైర్మన్లను నియమిస్తాం. నామినేటెడ్ పదవుల కోసం 60వేల దరఖాస్తులు వచ్చాయి. వీటిని పరిశీలిస్తున్నాం’ అని చంద్రబాబు పేర్కొన్నారు.