పోక్సో కేసులో నిందితునికి 20 సం.ల కఠిన కారగారా జైలు శిక్ష, 60,000 – రూ. జరిమానా విధింపు
– జిల్లాలో నేరాలకు పాల్పడిన వారికీ జైలు శిక్ష తప్పదు.
– నిందుతులకు శిక్ష పడటంలో కృషి చేసిన అధికారులను, సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) జూలై 2
పోక్సో కేసులో నిందితునికి 20 సం.ల కఠిన కారగారా జైలు శిక్ష, 60,000 – రూ. జరిమానా విధించడం జరిగిందని, జిల్లాలో నేరాలకు పాల్పడిన వారికీ జైలు శిక్ష తప్పదనీ జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర అన్నారు. తేది 02.07.2022 నా లింగంపేట్ మండలం ముస్తాపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి, ఎప్పటిలాగే రాత్రి తన కుటుంబ సభ్యులతో కలిసి నిద్రించాడు. అయితే రాత్రి సుమారు 10 గంటల సమయంలో లేచి చూసినప్పుడు తన 14 ఏళ్ల మైనర్ కుమార్తె కనిపించలేదు. వెంటనే చుట్టుపక్కల గాలించినా ఎటువంటి సమాచారం లభించకపోవడంతో మరునాడు తేది 03.07.2022 నాడు లింగంపేట్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పరిశోధనలో భాగంగా గ్రామస్తులను విచారించగ తెలిసింది లింగంపేట్ మండలం గాంధీనగర్ గ్రామానికి చెందిన అక్కరేని శ్రీకాంత్ (వయసు 20 సంవత్సరాలు, వృత్తి ట్రాక్టర్ డ్రైవర్) ముస్తాపూర్, గ్రామంలో ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా మైనర్ బాలికతో పరిచయం ఏర్పర్చుకున్నాడు. ఆమెను ప్రేమిస్తున్నాను,అని మాయమాటలు చెప్పి ఫోన్ నంబర్ తీసుకుని తరచుగా మాట్లాడుతూ ఆమెను వేధించినాడు. అలాగే తేది 02.07.2021 రాత్రి 10 గంటల సమయంలో బాలికకు ఫోన్ చేసి, ఇంట్లో నుండి బయటకు రమ్మని చెప్పి, బైక్‌పై మేడ్చల్ జిల్లా దబిల్‌పూర్ వద్దకు తీసుకెళ్లి అక్కడ కూడా లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక ఇంటివారు ఆమె కనిపించటలేదని లింగంపేట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయాన్ని తెలుసుకొని నిందితుడు తేది 06.07.2021న బాలికను లింగంపేట్ పోలీస్ స్టేషన్ వద్ద వదిలి పరారయ్యాడు. విషయములో సరియగు సాక్షాలను సేకరించి నేరస్తుడిని అరెస్టు చేయడం తదుపరి కోర్టు యందు అభియోగ పత్రం వేయడం జరిగింది. కేసులో సాక్షులను విచారించి, సాక్షాదారాలను పరిశీలించి కేసు రుజువు కావడం జరిగినదని జిల్లా న్యాయమూర్తి సిహెచ్ విఆర్ ఆర్ వర ప్రసాద్, నిoదితునికి 20 సంవత్సరాల కఠిన కారాగార జైలు శిక్ష 60,000 – రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు ఇవ్వడం జరిగినది. పోలీసు తరపున వాదనలు వినిపించిన పీపీ కె. శేషు, ఈ కేసును సరియగు పద్దతిలో విచారణ చేసిన అప్పటి ఎలారెడ్డి డిఎస్పి కె. శశాంక్ రెడ్డి, యస్ఐ కె. శ్రీకాంత్ , ప్రస్తుత ఎలారెడ్డి డిఎస్పి యస్. శ్రీనివాస్ రావు, యస్ఐ,వెంకట్ రావు,కోర్టు లైజనింగ్ ఆఫీసర్ ఎస్సై రాజయ్య, ఏఎస్సై రామేశ్వరు రెడ్డి, సీడీవో సాయిలు , తదితరులను అభినందించడం జరిగిందన్నారు.