ప్రభుత్వలు మారుతున్నాయి పాలన మారడం లేదు..?

ప్రభుత్వలు మారుతున్నాయి పాలన మారడం లేదు..?

– ఎవరి లాభం వారిదే..!

IMG 20250128 WA0013

దాటలేకపోతున్న వాహన దారులు..!

– పట్టించుకోని అధికారులు,..? ఎమ్మెల్యేలు..?

స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు కాంగ్రెస్, తెలుగుదేశం, కాంగ్రెస్, బి ఆర్ ఎస్, ప్రస్తుతమున్న కాంగ్రెస్ ఇన్ని పార్టీలు మారిన అందులో ఎంతమంది ఎమ్మెల్యేలు మారిన ఆ రోడ్డును మాత్రం పట్టించుకున్న దాఖలాలు లేవు…?జుక్కల్ నుండి మహారాష్ట్రకు వెళ్లాలంటే వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. రెండు రాష్ట్రాల మధ్యన ఉన్న ఈ రహదారి ప్రధాన రహదారి కానీ దీని పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ప్రజలకు సేవ చేయడంలో రాజకీయ నాయకులు కానీ, ప్రజలు పన్నులుగా చెల్లించే డబ్బులను వేతనాలుగా తీసుకుంటున్న అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడం తో ఆ రోడ్ల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే అన్న చందంగా ఉంది. ఇంతమంది రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలుగా వస్తూ పోతూ ఉన్నారు కానీ తమ హయాంలో ఈ రోడ్డును అభివృద్ధి చేస్తాను అని ఆలోచన మాత్రం ఏ ఎమ్మెల్యేకు కలగడం లేదంటే వారికి ప్రజాసేవ చేయడంలో ఎంత నిర్లక్ష్యం ఉందో ఈ రోడ్డును చూస్తే అర్థమవుతుంది. కేంద్రం నుండి రోడ్ల అభివృద్ధి కోసం వేలకోట్ల రూపాయలు నిధులు వస్తున్న అందులో నుండి కోటి రెండు కోట్ల రూపాయల సైతం ఈ రోడ్డు మరమత కోసం వినియోగించుకోవడం లేదంటే ఇక్కడి రారాకీయ నాయకుల పనితీరు, అధికారుల పనితీరు ఇట్టే అర్థమవుతుంది. ఇప్పటికైనా ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే ఈ రోడ్డు గురించి పట్టించుకోని వెంటనే రోడ్డును అభివృద్ధి చేయాలని జుక్కల్ నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment