బూర్గంపాడు మండల పర్యటనలో భాగంగా సారపాక పంచాయతీ పరిధిలో 65 లక్షలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి, సిసి రోడ్లను ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే పాయం
ఎమ్మెల్యే కి ఘన స్వాగతం పలికి షాలువాతో సత్కరించిన సారపాక ప్రజానీకం
స్థానికులతో మాట్లాడి పలు సమస్యలు అడిగి తెలుసుకున్న పాయం
బూర్గంపాడు మండలం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక పంచాయితీ పరిధిలో ఉన్నటువంటి సుందరయ్య నగర్,రిక్షా కాలనీ, కండక్టర్ కాలనీ,ఏడో వార్డు,పాత సారపాక,ప్రాంతాలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొని శంకుస్థాపనలు చేసిన పినపాక ఎమ్మెల్యే శ్రీపాయం పాయం మాట్లాడుతూ , మీ అందరి సమక్షంలో పుర ప్రముఖులు అక్కలు చెల్లెళ్లు అన్నలు తమ్ముళ్లు కాంగ్రెస్ పార్టీ నాయకుల సమక్షంలో సారపాక పంచాయతీ పరిధిలో 65 లక్షల రూపాయలతో చేపట్టినటువంటి సిమెంట్ రోడ్లు సైడ్ డ్రైన్లు కరెంటు లైన్ లకు సంబంధించినటువంటి పనులకు మీ అందరి సమక్షంలో ప్రారంభించుకోవడం మరియు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు మీరందరూ కూడా ఎన్నికల సమయంలో మీరు, నాకు చెప్పినటువంటి సమస్యలన్నీ నాకు గుర్తున్నాయని, అన్నిటిని పరిష్కరించే బాధ్యత నాదే అన్నారు ఎలక్షన్ల ముందు మీ ఏరియాలలో ప్రచారంలో తిరిగినప్పుడు,రానున్నది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే ఆరు పథకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని అవన్నీ కూడా ప్రతి పేదవాడికి దక్కే విధంగా నేను బాధ్యత తీసుకుంటానని అన్నారు,ఈ పినపాక నియోజకవర్గం లో ప్రతి ఒక్కరు, పార్టీ మీద, నా మీద, విశ్వాసంతో నన్ను బంపర్ మెజారిటీతో గెలిపించినందుకు మీ అందరికి రుణపడి ఉంటానని, మీ కష్టాలను తీర్చి మీకు న్యాయం చేకూరుస్తానని, మీరు మాపై చూపించినటువంటి ఆప్యాయత అంతా ఇంతా కాదన్నారు, ఎవరు ఊహించని, కని విని,ఎరుగని ఈ నియోజకవర్గ చరిత్రలోనే 35 వేల ఓట్ల మెజారిటీతో గెలిపిచ్చారంటే మీరు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పడిన కష్టం, మీరు నాపై చూపించే ఆప్యాయత నేను ఎన్నటికి మరువలేనని, మీ గ్రామాలలో స్లమ్ము ఏరియాలలో గోదావరి వరదొచ్చినప్పుడు మీరు, వరద వల్ల పడిన బాధలు కష్టాలు ప్రభుత్వ అధికారులు కార్యకర్తలు నాయకులు మీడియా మిత్రులు కూడా చూసామని, స్లమ్ ఏరియాలలో డ్రైనేజీలు కట్టాలని,కరెంట్ పోల్స్ ఏపీయాలని, ప్రజలు ఎటువంటి కష్టాలు పడకూడదని, మీ సమక్షంలోనే సిసి రోడ్లు డ్రైనేజీలు కరెంటు పోల్స్ 65 లక్షలతో ప్రారంభించుకోవడం చాలా ఆనందంగా ఉంది అన్నారు అంతేకాకుండా ఈ మండలంలో ఉన్న 18 పంచాయితీలను అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులుపాయం వెంకటేశ్వర్లు ఈ యొక్క కార్యక్రమానికి : ప్రభుత్వ అధికారులు, బూర్గంపాడు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కృష్ణా రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళ నాయకులు, మైనార్టీ సంఘాల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు