సైబర్ అటాక్..బ్యాంక్ అకౌంట్ నుండి 67,700/- లూటీ

IMG 20240810 WA0102

నర్సింగ్ ఆఫీసర్ మాచారెడ్డి మండలంలోని కాకుల గుట్ట తండా కు చెందిన భూఖ్య సంతోష్ సైబర్ నేరగాళ్లు డబ్బలు కొట్టేసారు అని స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.అనంతరం మాట్లాడుతూ 08/08/2024 రోజున సాయంత్రం దాదాపు ఐదు గంటలకు నా ఫోన్ నెంబర్ కు కొత్త నెంబర్ నుండి కొంతమంది వ్యక్తులు ఫోన్ చేసి ఆర్బిఎల్ బ్యాంకు నుండి మాట్లాడుతున్నాము మీ ఆర్బిఎల్ క్రెడిట్ కార్డు యొక్క అన్యువల్ చార్జ్ యాక్టివేషన్ లో ఉంది దాన్ని డి ఆక్టివేట్ చేయాలని ప్రాసెస్ చెప్పి చేయమనగా నేను నమ్మి వారి వాట్సాప్ నెంబర్ నుండి ఆర్బిఐ క్రెడిట్ కార్డ్ ఏపీకె ఫైల్ పంపగా దానిని నేను ఓపెన్ చేశాను దీంతో ఎస్బిఐ క్రెడిట్ కార్డ్ లో నుండి మొత్తం 67,700/- రూపాయలు పోయాయి అని సంతోష్ తెలిపారు. తను మోసపోయానని తెలుసుకొని 1930 నెంబర్ కు కాల్ చేసి పోలీస్ స్టేషన్ కి వచ్చి దరఖాస్తు చేశారు అని అలాగే కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించడం జరుగుతుంది అని పోలీస్ శాఖ తెలిపారు ..

Join WhatsApp

Join Now