యువకుడు చెరువులో మునిగి మృతి
కీసర, (ఫిబ్రవరి 20):
కీసర పోలీసు స్టేషన్ పరిధిలో ఓ యువకుడు చెరువులో మునిగి మృతి చెందిన సంఘటన తీవ్ర కలకలం లేపింది.వివరాల్లోకి వెళితే కీసర పోలీసులు తెలిపిన ప్రకారం…
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నానికి చెందిన సూర్యదేవ్ ఓబ్బిలినేని (26) తన పుట్టినరోజు సందర్భంగా చిన్ననాటి స్నేహితులను కలవడానికి హైదరాబాద్ వచ్చాడు. ఫిబ్రవరి 19న రాత్రి గచ్చిబౌలిలో బర్త్‌డే వేడుకలు జరుపుకున్న తర్వాత, తెల్లవారుజామున 1:00 నుంచి 2:00 గంటల మధ్య తన స్నేహితులు దినేష్, కాలేషా, లోహిత్, తేజలతో కలిసి కీసర మండలంలోని యాదగిరిపల్లి (అండర్ ద మూన్ స్పాట్) గండి చెరువు వద్దకు చేరుకున్నాడు.
అలసట కారణంగా కొంతసేపు అక్కడే గడిపిన యువకులు, ఉదయం 4:00 నుంచి 4:30 గంటల మధ్య చెరువులోకి దిగారు. అయితే, ప్రమాదవశాత్తుగా సూర్యదేవ్ నీటిలో మునిగి మృతిచెందాడు.
సమాచారం అందుకున్న కీసర పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలో ముంచేసింది. మరింత సమాచారం కోసం పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.