కూతురు కన్యాదానంలో తండ్రికి గుండెపోటు
కూతురు పెళ్లి లో విషాదం
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఘటన
ఆయుధం కామారెడ్డి
కూతురు పెళ్లి కోసం ఎంతో హడావిడిగా పనులు చేసిన తండ్రి పెళ్లి పీటలపై ఉన్న కూతురు అల్లుడు ఒక్కటవుతున్న శుభ సందర్భంలో కూతురు అల్లుని కాళ్లు కడిగి కన్యాదానం చేసి అక్షంతలు వేసి ఆశీర్వదించే లోపే ఆ తండ్రికి అకాల మృత్యు వు గుండెపోటుతో కాటేసింది. పెళ్లి మండపంలోని గుండెపోటు రావడంతో కింద పడి పోవడంతో జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి బంధువులు కుటుంబ సభ్యులు తరలించారు. స్థానికులు కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం రామేశ్వర్ పల్లి గ్రామానికి చెందిన కొడిక్యాల బాలచంద్రం (56) కామారెడ్డిలో హౌసింగ్ బోర్డ్ కాలనీలో కుటుంబ సభ్యులతో కలిసి గత కొన్నేళ్లుగా నివాసం ఉంటున్నారు. కామారెడ్డి గాంధీ గంజిలో కొన్ని సంవత్సరాలపాటు మునిముగా పనిచేశాడు. బాలచంద్రంకు భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె పేరు కనకమాలక్ష్మి చిన్న కుమార్తె పేరు మహాలక్ష్మి ఇద్దరు కూడా ప్రపంచ మెమొరీ లో టాప్ గా నిలిచి పలు అవార్డులు అందుకున్నారు. సామాన్య కుటుంబానికి చెందిన బాలచంద్రం పెద్ద కూతురు కనక మహాలక్ష్మి వివాహం శుక్రవారం దోమకొండ బైపాస్ చౌరస్తాలోని ఇంద్రప్రస్థా లో నిర్వహించగా కూతురు కాళ్లు కడిగి కన్యాదానం పూర్తి కాగానే అక్షంతలు వేసి ఆశీర్వదిం చాడు. అంతలోనే గుండెపోటు రావడంతో కళ్యాణ మండపంలో నే కుప్ప కూలిపోయాడు. వెంటనే బాలచంద్రం స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రి వైద్యులు పరీక్షించలోగే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. కూతురు పెళ్లి చేస్తూ ఎంతో హడావుడిలో ఉన్న బాల్ చంద్రం కూతురు పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్ళకముందే గుండెపోటుతో పెళ్లి మండపంలోని కుప్పకూలి ఆసుపత్రికి తీసుకెళ్లే వరకే మృతి చెందడం పలువురిని బంధువులను కుటుంబ సభ్యులను కలిచివేసింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.