గజ్వేల్, ఆగస్టు 29 (ప్రశ్న ఆయుధం న్యూస్): వినాయక చవితి సందర్బంగా పర్యావరణ పరిరక్షనే లక్ష్యంగా గత 21 సంవత్సరాల నుండి మట్టి గణపతులను పంపిణి చేసిన గజ్వేల్ లోని శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సంస్థ మరో అడుగు ముందుకేసి కళత్మాకతో తీర్చి దిద్దిన వారిని కూడా సన్మానించి ప్రోత్సాహిస్తుంది. అందులో భాగంగా వర్గల్ మండలానికి చెందిన దయాకర్ అనే కాలేజీ యువకుడు మోదుగు ఆకులను ఉపయోగించి 7 అడుగుల భారీ గణపతిని అద్భుతంగా తయారుచేసిన సందర్బంగా శుక్రవారం నాడు శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు సందర్శించి దయాకర్ ను ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రకృతిలో ఉన్న ప్రతి దాన్ని ఉపయోగించి వినాయకుణ్ణి తయారు చేసుకొని పూజించుకోవచ్చని వర్గల్ కు చెందిన అయ్యగల్ల వెంకటేష్, రాములమ్మ దంపతుల కుమారుడు దయాకర్ నిరూపించారు. మోదుగు ఆకులను ఉపయోగించి 3రోజులు శ్రమించి 7అడుగుల భారీ గణపతిని అద్భుతంగా రూపొందించి నేటి యువతకు ఆదర్శ ప్రాయంగా నిలిచారన్నారు. ప్రతి సంవత్సరం వినూతనంగా తయారు చేయడం దయాకర్ కళ ఓ ప్రత్యేకత అన్నారు. పీఓపీ గణపతుల వల్ల చాలా ప్రమాదం ఉందన్నారు. ఇలాంటి కళాత్మక గణపతి గాని, మట్టి గణపతిని గాని ప్రతిష్టించినట్టయితే ఏ జీవరాసికి నష్టం వాటిల్లదన్నారు. ఈ కార్యక్రమంలో తాళ్ళ పాండు, బుడిగే నాగరాజు, వెంకటేష్, స్వామి, కనకయ్య, బద్రి, సామాజిక కార్యకర్త సాధిక్ పాషా తదితరులు పాల్గొన్నారు
మోదుగు ఆకులతో 7అడుగుల గణపతి అద్భుతం
Oplus_131072