*భారతీయ మజ్దూర్ సంఘ్‌కు 70 ఏళ్ళ ఘన ప్రయాణం – నాగారం లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా*
మేడ్చల్ జిల్లా నాగారం ప్రశ్న ఆయుధం జూలై 23
భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) ఆవిర్భవించి 70 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నాగారం పురపాలక సంఘం కార్యాలయ ఆవరణలో జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి, మాజీ జెడ్పీటీసీ మునుగంటి సురేష్, మాజీ కౌన్సిలర్ బిజ్జా శ్రీను గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ మాజీ చైర్మన్ చంద్రారెడ్డి, “కార్మికుల శ్రమను ప్రభుత్వాలు దోచుకుంటున్నాయి. కార్మికులందరూ ఐకమత్యంగా పోరాడితే తప్పకుండా తమ హక్కులను సాధించగలరు,” అని పేర్కొన్నారు.మాజీ జెడ్పీటీసీ మునుగంటి సురేష్ మాట్లాడుతూ, “రోజుకు 8 గంటల పని, వారానికి 48 గంటలు మించి పనిచేసిన కార్మికులకు ఓవర్‌టైం చెల్లించాలి. ఆదివారం తప్పనిసరిగా సెలవుగా ప్రకటించాలని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి,” అని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బీఎంఎస్ రాష్ట్ర నాయకులు రాము, రాఘవేందర్, పురుషోత్తం, ప్రవీణ్, అలాగే బీఎంఎస్ సభ్యులు, నాగారం పురపాలక సంఘం కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కార్మిక ఐక్యతకు ప్రాధాన్యత ఇచ్చే ఈ కార్యక్రమం కార్యకర్తల్లో స్ఫూర్తి నింపింది.