డబ్బులు కట్టి మోసపోయిన యువకుడు

డబ్బులు కట్టి మోసపోయిన యువకుడు

– మాచారెడ్డి మండలంలో ఘటన

ప్రశ్న ఆయుధం కామారెడ్డి

మిత్రుడు పంపిన లింకు డబ్బులు కట్టి మోసపోయిన కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి మండల యువకుడు. మాచారెడ్డి ఎస్ఐ అనిల్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి మండలం సర్దాపూర్ తండాకు చెందిన నునావత్ దేవేందర్ తనకు తెలిసిన ఫ్రెండ్ ద్వారా వాట్సాప్ గ్రూప్ లో ఒక లింకు రాగా అట్టి లింకు ద్వారా ఇన్వెస్ట్ చేస్తే డబ్బులు ఎక్కువ వస్తాయని చెప్పగా ఫిర్యాదుదారుడు తేదీ 22/12/24 నాడు అట్టి లింకు ద్వారా వచ్చిన నెంబర్కు మొత్తం డబ్బులు 1,23,910 రూపాయలను పంపినాడు తర్వాత తను మోసపోయినాడని తెలిసినాక 1930 కు ఫిర్యాదు చేసినాడనీ, అనంతరం మాచారెడ్డి పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగిందని ఎస్సై మాచారెడ్డి తెలిపినారు.

Join WhatsApp

Join Now