యాసంగిలో 72.42 లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లు: ఉత్తమ్
TG: ఈ ఏడాది యాసంగిలో 72.42 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ వెల్లడించారు. 2023 యాసంగి సీజన్తో పోలిస్తే ఇది 12.65 లక్షల టన్నులు అధికమని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం 12.33 లక్షల మంది రైతుల నుంచి రూ.16,760 కోట్ల విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ.15,121 కోట్లు చెల్లించినట్లు పేర్కొన్నారు. ‘నాడు వరి వేస్తే ఉరి-నేడు వరి వేస్తే సిరి’ ఆయన ట్వీట్ చేశారు.