విద్యార్థి తల్లిదండ్రులారా 73వ రాజ్యాంగ సవరణ
73వ రాజ్యాంగ సవరణ ప్రకారం పాఠశాల విద్యాశాఖ నియంత్రణలో ఉన్న అన్ని పాఠశాలలకు చెందిన అంశములకు సంబంధించిన అధికారాలు, బాధ్యతలను పంచాయితీరాజ్ సంస్థలకు ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 2 తేది 03.02.2008 ద్వారా బదలాయింపు చేయడం జరిగింది.మన గ్రామపంచాయితీ విద్యా ఉపకమిటీ ఏర్పాటు… చేశారా లేదా గమనించండి… లేకుంటే ఏర్పాటు చేయమని సలహా ఇవ్వండి..మన గ్రామ పరిధిలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు సమస్యలను వారి దృష్టికి తీసుకుపోండి.ప్రతి గ్రామ పంచాయితీ పరిధిలోని పంచాయితీ విద్యా ఉపకమిటీని గ్రామ సర్పంచ్ అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందులో మహిళ వార్డు సభ్యులతో ఒకరు వైస్ చైర్మెన్ గాను, మరొకరు సభ్యులుగాను మరియు షెడ్యుల్డ్ కులాలు / తెగలు లేదా వెనుకబడిన తరగతులకు సంబంధించిన ఇద్దరు వార్డు సభ్యులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారుఉపకమిటీ విధులు :గ్రామ పంచాయితీ పరిధిలోని అన్ని పాఠశాలల పనితీరు.పాఠశాల సిబ్బంది రోజు వారి హాజరు.పిల్లల విద్యా ప్రమాణాలు పాఠశాల మౌళిక సదుపాయాలు మధ్యాహ్న భోజనం పథకం సక్రమ అమలు మొదలగు వాటిని పర్యవేక్షించే అధికారం కలిగి ఉంటుంది.సమావేశాల నిర్వహణ.ఉపకమిటీ ప్రతి శనివారం, ఒకవేళ శనివారం సెలవుదినమైతే ఆ ముందు రోజు సమావేశం నిర్వహిస్తుంది. సమావేశానికి గ్రామ పంచాయితీ పరిధిలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు ఇద్దరు లేదా ముగ్గురు సీనియర్ ఉపాధ్యాయులు పాల్గొంటారు.చర్చించే అంశాలు :ఉపాధ్యాయుల హాజరు…పిల్లల నమోదు గైర్హాజరు…మధ్యలో బడిమానిన పిల్లల వివరాలు మరియు కారణాలు…పాఠశాలకు అవసరమగు స్వల్ప మరమ్మత్తులుపై అంశాలకు సంబంధించిన గ్రామ పంచాయితీ అందించే సహాయం తదితర విషయాలను ఉపకమిటీ చర్చిస్తుంది.అలాగే ఈ దిగువ తెలిపిన విషయాలను కూడా తనిఖీ చేసే అథారిటీని కలిగి ఉంటుంది….ఉపాధ్యాయులు బడి వేళలు పాటించేలా చూడటం..పాఠశాలలో అమలవుతున్న కార్యక్రమాల తీరు పర్యవేక్షించడం. మధ్యాహ్న భోజనం నాణ్యతను తెలుసుకోవడం….
పాఠ్యపుస్తకాల సరఫరాలను పరిశీలించడం….
పాఠశాల ఫర్నీచర్, లైబ్రరీ పుస్తకాలు, ప్రయోగశాలలు ఎక్విప్ మెంట్ సరిగా ఉన్నదీ లేనిదీ సరిచూసి నివేదికలను ఉన్నతాధాకారుల దృష్టికి తీసుకెళ్ళడం..ఉన్నత పాఠశాలలైతే అందులో చదివే 10 వ తరగతి విద్యార్థులకు నిర్వహించే ప్రత్యేక తరగతుల నిర్వహణకు అవసరమైన లైటింగ్, అల్పాహారం తదితర ఏర్పాట్లను గ్రామ పంచాయితీ సహకారంతో సమకూర్చడం…
మీ దృష్టికి తెస్తున్నా ప్రధాన అంశాలు…
బడి బయట పిల్లలు వారు బడికి వెళ్ళేటట్టు చర్యలు తీసుకోవడం. (నిర్బంధంగా నైనా) మన గ్రామంలో ఏ పిల్లవాడు బడి బయట ఉండేందుకు అవకాశం లేదని నిబంధన పెట్టుకోవాలి.పాఠశాల ప్రారంభ సమయంలో” ఉపాధ్యాయుడీ సెల్ ఫోన్ “హెడ్ మాస్టర్ వద్ద డిపాజిట్ చేసేటట్టు చర్యలు తీసుకోవాలి.మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించడంతోపాటు భుజించడం చేయాలి. పాఠ్యపుస్తకాలు మౌలిక వసతులు కల్పించమని ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకోవడమే కాకుండా అమలయ్యే వరకు ఫాలోఅప్ చేయాలి. ప్రతి పాఠశాలలో మంచినీటి వసతి ,పరిశుభ్రంగా మరుగుదొడ్లు (మగ ,ఆడ పిల్లలకు వేరువేరుగా) ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి.మన పిల్లలకు పాఠ్యాంశం పూర్తి కావడంతోనే పరీక్షల నిర్వహణ చేసే విధంగా మరియు చదువు వెనుకబడిన పిల్లలకు అవసరమైన శిక్షణ( ప్రైవేట్ క్లాస్ లు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి.మన పిల్లలకు పాఠశాలలో క్రీడా మైదానం ఆట వస్తువులు ,క్రీడా పోటీలు ,శిక్షణ ఇవ్వడం. నిర్వహించాలి. విద్యార్థి తల్లిదండ్రులతో ఏర్పాటు చేసిన విద్యా కమిటీలు సమాచారం ఇవ్వడం అందరూ పాల్గొనేలా ప్రతినెలా జరిగేలా మరియు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి మొత్తం విద్యార్థి తల్లిదండ్రుల తో మన పిల్లల విద్యకు సంబంధించి పాఠశాల అభివృద్ధికి సంబంధించి గ్రామంలోని తల్లిదండ్రులను భాగస్వామ్యం చేసేందుకు సమావేశం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి. స్థానిక మండల,గ్రామ వైద్యాధికారులు సిబ్బందితో పాఠశాలలో ప్రతి 3 నెలలకు ఒక మారు ” వైద్య శిబిరం ఏర్పాటు తోపాటు పిల్లల ఆరోగ్య నిరంతర పర్యవేక్షణ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. మన పిల్లల విద్య పట్ల మరియు శాస్త్ర సాంకేతిక క్రీడా పరమైన అంశాల పట్ల. ఆసక్తి ,చైతన్య పరిచేందుకు నిష్ణాతులైన అనుభవజ్ఞులతో సమావేశం ఏర్పాటు చేయాలిరాజ్యాంగం మనకు కల్పించిన హక్కుల అమలు ప్రతి విద్యార్థి తల్లిదండ్రి పునుకుంటారని ఆశిస్తూ…