జిల్లాలో అక్రమ మొరం తవ్వకాలు జరుపుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి
– సిపిఎం కామారెడ్డి జిల్లా కమిటీ
ప్రశ్న ఆయుధం – కామారెడ్డి
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా మనం తవ్వకాలు జరుపుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సిపిఎం కామారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా అడిషనల్ కలెక్టర్ ( రెవెన్యూ ) విక్టర్ కు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వెంకట్ గౌడ్ , కొత్త నరసింహులు మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలో అక్రమ మొరంతవ్వకాల జోరుగా కొనసాగుతున్నాయని సంబంధిత అధికారులు వ్యాపారులతో కలిసిపోయారని విమర్శించారు. స్పందించిన జిల్లా జైంట్ కలెక్టర్ వెంటనే ఆర్డివోలకు ఆదేశాలిస్తూ జిల్లాలో మొరం తవ్వకాలు ఎక్కడెక్కడ జరుగుతున్న తెలుసుకొని వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే కామారెడ్డి జిల్లాలో భూగర్భ జలాల అడుగంటి పోయాయని, అనుమతులు లేకుండా మొరం తవ్వకాలు చేస్తూ వ్యాపారాలు నడుపుతున్న వారి పై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలన్నారు. ప్రధానంగా బిక్నూరు, మాచారెడ్డి, రాజంపేట, బాన్సువాడ, .ఎల్లారెడ్డి, దోమకొండ, మండలాల్లో కళ్ళు ముందు తిరుగుతున్నప్పటికీ చూసి చూడనట్టు అధికారులు ఉంటున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.